షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!
- June 02, 2026
యూఏఈ: షార్జాలో రెండేళ్ల బాలుడి మృతికి సంబంధించి అధికారులు రెండు భారతీయ కుటుంబాలను విచారిస్తున్నారని వారికి సహాయం చేస్తున్న ఒక న్యాయవాది తెలిపారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఈ కుటుంబాలను, ఒక నివాస టవర్లోని మెట్ల ప్రాంతం నుండి బాలుడు కిందపడి మరణించిన ఘటన జరిగిన రోజే విచారణకు తీసుకువెళ్లారని న్యాయవాది ప్రీతా శ్రీరామ్ మాధవ్ తెలిపారు.
ఆ పాకిస్తానీ బాలుడు తన కుటుంబం నివసించే అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్లి, భవనం పై అంతస్తులోని మెట్ల దగ్గర ఉన్న ఒక సందులోంచి కిందపడి మరణించాడని మొదట భావించారు. అయితే, ఈ విషాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు, రెండు భారతీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలికలు అతనితో కలిసి ఆడుకున్నారు. ఆ మూడు కుటుంబాలు షార్జా టవర్‌లో పక్కపక్కనే నివసిస్తారు. కాగా, ప్రమాదానికి ముందు సరిగ్గా ఏమి జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు ఇప్పుడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తులో ఉందని, బాలల సంరక్షణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో కలిసి అన్ని చట్టపరమైన ప్రక్రియలు చేపడుతున్నట్లు ఒక సీనియర్ షార్జా పోలీస్ అధికారి తెలిపారు. ఆ చిన్నారి మెట్ల ప్రాంతంలోకి ఎలా ప్రవేశించిందో మరియు అక్కడ ఉన్న భద్రతా చర్యలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి దర్యాప్తు అధికారులు నిఘా ఫుటేజీని పరిశీలిస్తున్నారని, సాక్షులను విచారిస్తున్నారని, భవనం లేఅవుట్‌ను చెక్ చేస్తున్నట్లు తెలిపారు.
యూఏఈ చట్టం ప్రకారం, మైనర్ పిల్లల చర్యలకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకే ఆ కుటుంబాలను ప్రశ్నిస్తున్నామని ప్రీత పేర్కొన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తమ పిల్లల భద్రత, పెంపకంపై దృష్టి పెట్టాలని ప్రీత సూచించారు.
తాజా వార్తలు
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- డాలస్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- ఖతార్ లో ఔట్ సైడ్ వర్క్ పై బ్యాన్..కీలక సూచనలు..!!
- గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్‌చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- కువైట్ జలాల్లో షార్క్.. ఈపీఏ క్లారిటీ..!!
- షార్జాలో బాలుడు మృతి..సీసీటీవీ ఫుటేజీతో విచారణ వేగవంతం..!!
- ఇన్వెస్ట్ మెంట్ రౌండ్స్.. ముందస్తు నోటిఫికేషన్ తప్పనిసరి: SAMA
- తెలంగాణను దేశానికే ఆదర్శంగా మార్చినం: కేసీఆర్









