ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- June 02, 2026 , by Maagulf
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ సి.వి.ఆనంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ లక్ష్యాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం మరియు విశిష్ట సేవలను కనబరిచిన 17 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి గ్యాలంట్రీ మెడల్స్‌ను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన ఒక కానిస్టేబుల్‌కు జీవన్ రక్షా పతక్ అందజేశారు. ఇతర శాఖలకు చెందిన పలువురు సిబ్బందికి కూడా విశిష్ట సేవలకుగాను పురస్కారాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారందరికీ డీజీపీ సి.వి ఆనంద్ అభినందనలు తెలిపారు. వారి ధైర్యం, త్యాగం, సేవా నిబద్ధత తెలంగాణ పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com