తొలి 30 మిలియన్ దిర్హమ్‌ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!

- June 03, 2026 , by Maagulf
తొలి 30 మిలియన్ దిర్హమ్‌ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!

యూఏఈ:  యూఏఈ లాటరీ తన 30 మిలియన్ దిర్హమ్‌ల గ్రాండ్ ప్రైజ్ మొదటి విజేతను వెల్లడించింది. మే 27న జరిగిన డ్రాలో అబుదాబిలో నివసిస్తున్న ఒక నేపాలీ నివాసి యాబ్ ఖాన్ జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు. గ్రాండ్ ప్రైజ్ విజేతగా నిలవడం పట్ల ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. తాను డ్రాను చూడలేదని,  ఇమెయిల్ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫలితం గురించి తెలుసుకున్నానని చెప్పారు. తాను యాదృచ్ఛికంగా నంబర్లను ఎంచుకున్నట్లు తెలిపాడు.  
ఈ సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 29న జరిగిన డ్రాలో రెండవ  5 మిలియన్ దిర్హమ్స్ విజేతల తర్వాత, రెండవ అతిపెద్ద గ్రాండ్ ప్రైజ్ విజేతగా ఖాన్ నిలిచాడని నిర్వాహకులు తెలిపారు. ఈ విజయాన్ని లక్కీ డే డ్రా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా యూఏఈ లాటరీ ప్రతినిధి అభివర్ణించారు.

లక్కీ డే డ్రాలు ప్రతి బుధవారం మరియు శనివారం రాత్రి 9.30 గంటలకు జరుగుతాయి. ఇందులో పాల్గొనేవారికి 30 మిలియన్ దిర్హమ్స్ గ్రాండ్ ప్రైజ్, 5 మిలియన్ దిర్హమ్స్ రెండవ ప్రైజ్ లతోపాటు ఒకొక్కటి 50,000 దిర్హమ్స్ విలువైన మూడు గ్యారెంటీడ్ లక్కీ ఛాన్స్ ప్రైజ్‌లను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com