బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- June 03, 2026
మనామా: ఒక పేషంట్ బ్రెయిన్ ట్యూమర్ ని నిర్ధారించడంలో ఆరు వారాల ఆలస్యానికి కారణమైన ఒక న్యూరాలజీ కన్సల్టెంట్‌కు విధించిన BD200 జరిమానాను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది.
ఆ రోగి వాంతులు, తలనొప్పితో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారని, ఆ కన్సల్టెంట్ CT స్కాన్ లేదా MRI చేయమని కోరకుండా, ఆమె పరిస్థితిని నెక్ స్ట్రెయిన్ అని కొట్టిపారేశారని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఆరు వారాల తర్వాత, సెకండ్ డాక్టర్ స్కాన్‌లను ఆదేశించగా, అందులో ఒక పెద్ద క్యాన్సర్ ట్యూమర్ ఉన్నట్లు వెల్లడైందని, అప్పటికే ఆమె పరిస్థితి గణనీయంగా క్షీణించిందని, చివరికి ఆపరేషన్ కోసం ఆమెను విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
వైద్య లోపాలపై సాంకేతిక కమిటీ చేసిన నిర్ధారణలను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. ఆ డాక్డర్ వృత్తిపరమైన తప్పిదానికి పాల్పడ్డాడని తీర్పు ఇచ్చింది. పేషంట్ పౌర పరిహార దావాను సివిల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







