బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- June 04, 2026
మనామా: బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ తరపున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్లు గుర్తించిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరు యువతను లక్ష్యంగా చేసుకుని, అనైక్యతను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ సంస్థల అజెండాలను అమలు చేయడానికి సెల్స్‌ను ఏర్పాటు చేస్తూ, ఈ నెట్వర్క్ పనిచేసిందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం న్యాయపరమైన విచారణలు జరుగుతున్నాయని, అదే సమయంలో ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. జాతీయ భద్రత మరియు సామాజిక స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పౌర శాంతికి భంగం కలిగించడానికి లేదా బహ్రెయిన్ సమాజంలో విభజన సృష్టించడానికి ప్రయత్నించే ఎవరినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







