'సిగ్మా' ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్
- June 04, 2026
దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన సందీప్ కిషన్, జేసన్ సంజయ్, ఎస్.తమన్, లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ ప్రజెంట్స్“సిగ్మా” ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్
సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సిగ్మా’. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. తమన్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కంపోజ్ చేశారు.
తాజాగా హీరో దుల్కర్ సల్మాన్ ‘సిగ్మా’ ఫస్ట్ సింగిల్ ‘సిగ్మా స్టైల్’ ను లాంచ్ చేశారు. తమన్ స్వయంగా కంపోజ్ చేసి ఆలపించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ మాస్ బీట్లతో అదిరిపోయింది. థమన్ సిగ్నేచర్ స్టైల్ మ్యూజిక్, హై-వోల్టేజ్ రిథమ్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సందీప్ కిషన్ తన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకోగా, ఫారియా అబ్దుల్లా కూడా టు అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్‌తో పాటకు మరింత కలర్ తీసుకొచ్చింది.
జేసన్ సంజయ్ రాసిన క్యాచీ లిరిక్స్, థమన్ మాస్ ట్యూన్, సందీప్-ఫారియా డైనమిక్ పెర్ఫార్మెన్స్ కలిసి ‘సిగ్మా స్టైల్’ను ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి. ఈ సాంగ్‌తో సినిమాపై క్యూరియాసిటీ, ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి.
ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. చిత్ర ఆడియో హక్కులను సరేగమా సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
సిగ్మా ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







