ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- June 05, 2026
యూఏఈ: తమ ఇంటి బయట ఇంట్లో తయారుచేసిన డ్రింక్స్, బేక్ చేసిన వస్తువులను పిల్లలు అమ్ముతున్నట్లు చూపిస్తున్న ఒక సోషల్ మీడియా ట్రెండ్ దుబాయ్ లో ప్రజలను ఆకట్టుకుంది. అయితే, ప్రతి స్టాల్‌కు చట్టపరమైన బాధ్యతలు ఉంటాయని దుబాయ్ మున్సిపాలిటీ (DM) నివాసితులకు గుర్తుచేస్తోంది.
దుబాయ్ వ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, యువ పారిశ్రామికవేత్తలు తాజా జ్యూస్‌ల నుండి ఇంట్లో తయారుచేసిన కుకీల వరకు అన్నీ అందిస్తున్న వీడియోలను పంచుకుంటున్నారు. పిల్లల చొరవను, వ్యాపార స్ఫూర్తిని వ్యాఖ్యాతలు విస్తృతంగా ప్రశంసిస్తున్నారు. అయితే, తమ సొంత ఇంటి ముందు ఆహార పదార్థాలను విక్రయించేటప్పుడు నివాసితులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను తెలియజేస్తూ.. దుబాయ్ మున్సిపాలిటీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
లైసెన్స్ ఫస్ట్..సేల్ లేటర్
ఎంత చిన్నదైనా సరే, ఏ ఆహార విక్రయ కార్యకలాపానికైనా ముందుగా అనుమతులు, లైసెన్సులు అవసరమని మున్సిపాలిటీ తెలిపింది. దుబాయ్ ఆర్థిక, పర్యాటక శాఖ (DM) నుండి అవసరమైన లైసెన్సులను పొందాలని సూచించింది.
హోమ్ బిజినెస్
తాము గృహ ఆధారిత వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, నివాసితులు ప్రతిదీ సరైన పద్ధతిలో చేయాలని దుబాయ్ మున్సిపాలిటీ స్పష్టం చేసింది. అవసరమైన లైసెన్సులు పొంది, ఆమోదించబడిన నిబంధనల మేరకు చట్టాల పరిధిలో పనిచేస్తే, మున్సిపాలిటీ హోం బిజినెస్ ను ప్రోత్సహిస్తుందని తన ప్రకటనలో స్పష్టం చేసింది.
పిల్లలు ఆహార విక్రయాలను అన్వేషించడానికి సురక్షితమైన, లైసెన్స్ పొందిన మార్గం కోసం చూస్తున్న కుటుంబాల కోసం, దుబాయ్ మున్సిపాలిటీ ఇప్పటికే సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. వీటిలో నాద్ అల్ షేబా మరియు అల్ బర్షాలో నిర్వహించబడే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఇనిషియేటివ్ కూడా ఒకటి అని గుర్తుచేసింది.
దుబాయ్ మున్సిపాలిటీ నివాసితులందరినీ వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. కుటుంబ విల్లా బయట పిల్లలను స్టాల్ ఏర్పాటు చేయడానికి అనుమతించే ముందు, ఆ కార్యకలాపానికి అవసరమైన లైసెన్సులు తీసుకునేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







