NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- June 06, 2026
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి వస్తుంటారు. విదేశాల నుంచి వచ్చే ఎన్ఆర్ఐల కోసం టీటీడీ సుపథం మార్గంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐలు ఇండియాకు వచ్చిన నెలలోపు స్వామివారిని దర్శించుకోవచ్చు..ఆ తర్వాత అనుమతించరు. ప్రస్తుతం ఎన్ఆర్ఐలు స్వామివారిని దర్శించుకోవడానికి 30 రోజులగా ఉన్న గడువు పరిమితిని టీటీడీ ఏకంగా 90 రోజులకు (3 నెలలు) పెంచింది.
ఇప్పటి వరకు ఎన్ఆర్ఐలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి.. ఇండియాకు వచ్చిన 30 రోజుల్లోనే ఒరిజినల్ పాస్‌పోర్ట్, ఒక సెట్ జిరాక్స్ కాపీతో తిరుమలలోని సుపథం దగ్గరకు వెళితే వాటిని పరిశీలించి తర్వాత రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ జారీ చేస్తారు. నెలలోగా స్వామివారిని దర్శించుకోవాలని నిబంధనతో చాలామంది ఎన్ఆర్ఐలు ఇబ్బందిపడుతున్నారు. కొంతకాలంగా ఈ గడువునుపెంచాలనే రిక్వెస్ట్‌లు వచ్చాయి.. టీటీడీ స్పందించి ఆ గడువును నెల నుంచి 90 రోజులకు పెంచింది.
టీటీడీ భక్తుల కోసం అమలు చేస్తున్న శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి నుంచి ఆదరణ వస్తోందని చెబుతున్నారు. టీటీడీ ఆపన్న హృదయ ట్రస్టుకు రూ.లక్ష విరాళంగా అందించిన భక్తులు ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. భక్తులు ఒకరోజు ముందుగా తిరుమలకు వచ్చి దాతల విభాగంలో రూ.లక్ష విరాళం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కోసం ఒక్కొక్కరికి రూ.500 చొప్పున రూ.2,500 చెల్లించాలి.ఈ ఐదుగురు భక్తులకు మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. టీటీడీ దాతల విభాగంలో ఆపన్న హృదయ ట్రస్టుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది.
కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం వైభవోపేతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. అంతకుముందు ఉదయం 7 గంటల నుండి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పుష్కరిణి సమీపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9.15 గంటల నుండి 10.30 గంటల వరకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకాలు నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు చక్రస్నానం ఘనంగా నిర్వహించారు.
తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో జరిగిన అన్ని సేవలు సఫలమై, లోకక్షేమం, సకాల వర్షాలు, ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం చక్రస్నానం నిర్వహించినట్లు ఆగమ పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని చక్రస్నానాన్ని దర్శించిన భక్తులు సమస్త పాప విముక్తులై, ఐశ్వర్యాలు, ధనధాన్య సమృద్ధిని పొందుతారని విశ్వాసం.
తాజా వార్తలు
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్‌వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!









