టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడమే తెలంగాణ టార్గెట్
- August 09, 2016
టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడమే టార్గెట్ గా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోందా.. తాజాగా టీ సర్కార్ తీసుకున్న అనేక పాలసీ డెసిషన్స్ ని పరిశీలిస్తే అదే అనిపిస్తుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి ఫిలిం ఇన్స్టిట్యూట్ నిర్మించనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. 24 క్రాఫ్ట్స్ మీద ఆధారపడ్డ స్థానిక సినిమా కార్మికులకు ఆసరానివ్వడం, శిక్షణ కోసం దేశ-విదేశాల నుంచి వచ్చే వసతి సదుపాయాలు, సినిమా నిర్మాణంలో ఆధునిక ఒరవడిని అందిపుచ్చుకోవడం.. ఇవీ తెలంగాణ ఇంటర్నేషనల్ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లక్ష్యాలు. 100 ఎకరాల భూసేకరణకు సంబంధించిన కసరత్తును త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు.కేసీఆర్ సర్కార్ పవర్లోకొచ్చిన కొత్తల్లోనే రాచకొండ గుట్టల్లో మరో ఫిలిం సిటీ నిర్మించనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి కేసీఆర్ స్వయంగా ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. అది కూడా ఆచరణలోకొస్తే హైదరాబాద్ హాలీవుడ్ కు మరో చిరునామాగా మారినా ఆశ్చర్యం లేదని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. విశాఖను కూడా సినిమా షూటింగులకు అడ్డాగా మారుస్తామన్న ఏపీ సర్కార్ హామీ ఒకటి ఉందనే వుంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







