అండర్‌ గ్రాడ్యూయేట్‌ జాబ్‌ మేళా ..

- August 09, 2016 , by Maagulf
అండర్‌ గ్రాడ్యూయేట్‌ జాబ్‌ మేళా ..

 డిగ్రీలోపు చదివిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఈ నెల 20 వతేదీన అండర్‌ గ్రాడ్యూయేట్‌ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ ఉపాధ్యక్షుడు కుశలవ్‌ కు మార్‌ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫో మీడియా పోర్టల్‌ ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ ఆధ్వర్యంలో 7 వ తరగతి నుంచి డిగ్రీలోపు విద్యార్హతలు కలిగిన వారు, డిగ్రీ పట్టభద్రులు ఈ మేళాలో పాల్గొన వచ్చునన్నారు. ఉచితంగా జరిగే ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనదలిచిన ఆసక్తి పరులు ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ వెబ్‌ సైట్‌లో తమ బ యోడేటా లను ఈ నెల 19వ తేది వరకు పంపవచ్చునని తెలిపారు. సమాచారం కోసం 7337556150 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com