రూ.1,511కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- June 08, 2026
హైదరాబాద్: ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో రూ.1,511 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. 10 ఎకరాల్లో రూ.98కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి రేవంత్ శంకుస్థాపన చేశారు. రూ.960 కోట్లతో ఏవోసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికీ కొబ్బరికాయ కొట్టారు. అలాగే రూ.416కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
రూ.37.50కోట్లతో 100పడకల మల్కాజ్గిరి జిల్లా ఆస్పత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరోవైపు క్యూర్ వన్ యాప్‌ను ప్రారంభించారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీ గణేశ్ పాల్గొన్నారు..
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







