'సామి 2' సినిమా వీలైనంత త్వరగా సెట్స్‌పైకి ..

- August 09, 2016 , by Maagulf
'సామి 2' సినిమా వీలైనంత త్వరగా సెట్స్‌పైకి ..

 సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేసే నటుడు విక్రం. తాజాగా ఆయన నటించిన 'ఇరుముగన్‌' ట్రైలర్‌ను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో దీన్ని రూపొందించారు. నయనతార, నిత్యామేనన్‌ కథానాయికలు. ఈ సినిమా తర్వాత నటుడు విక్రం 'గరుడ' సినిమాలో నటించనున్నట్లు ప్రకటించారు. అయితే 'ఇరుముగన్‌' ఆడియో విడుదల సమయంలో 'సామి 2' సినిమా గురించి ప్రకటించారు. విక్రం నటించిన 'సామి' చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ వస్తున్నట్లు ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తమ అభిమాన హీరోను మళ్లీ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో చూడటానికి ఉత్సుకత చూపుతున్నారు. అంతేకాక 'గరుడ' సినిమా కొన్ని కారణాలతో ఆలస్యమవుతున్నట్లు సమాచారం. అందుకే హరి దర్శకత్వంలోని 'సామి 2' సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని విక్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com