తెలంగాణ: R&B శాఖలో సంచలనం రేపిన ఏసీబీ దాడులు
- June 09, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖలో అత్యున్నత అధికారి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆర్‌అండ్బీ శాఖ ఈఎన్‌సీగా విధులు నిర్వహిస్తున్న మోహన్ నాయక్ ఇళ్లతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు ఉదయం నుంచి విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌తో పాటు స్వగ్రామంలోనూ తనిఖీలు
హైదరాబాద్ నగరంలోని మోహన్ నాయక్ ప్రధాన నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామమైన మోపాల్ మండలం కులాస్ పూర్ తండాలోనూ ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. కులాస్‌పూర్ తండాలోని మోహన్ నాయక్‌కు చెందిన విలాసవంతమైన ఫామ్ హౌస్‌లోనూ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
మోహన్ నాయక్ సొంత ఇళ్లే కాకుండా, ఆయనకు అత్యంత ఆప్తులు, బంధువుల నివాసాలను కూడా ఏసీబీ వదల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లోని అతని బంధువుల నివాసాల్లో ఉదయం నుంచే ఏకకాలంలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, పట్టుబడిన నగదు, ఆస్తుల విలువ ఎంత అనేది సోదాలు ముగిసిన అనంతరం ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







