ఐఐఐటీ జంక్షన్–డీఎల్‌ఎఫ్ కారిడార్ అభివృద్ధి పనులను పరిశీలించిన సైబరాబాద్ సీపీ
- June 09, 2026
హైదరాబాద్: గచ్చిబౌలి పరిధిలోని ఐఐఐటీ జంక్షన్ వద్ద కొనసాగుతున్న రహదారి అభివృద్ధి, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి డీఎల్‌ఎఫ్ జంక్షన్ వరకు చేపడుతున్న ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
శేర్లింగంపల్లి ఏడీసీపీ హనుమంతరావు, సిఎంసి (CMC) అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన సీపీ, పనులు నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నిర్మాణ పనుల నేపథ్యంలో రాబోయే మూడు నెలల పాటు ప్రత్యేక ట్రాఫిక్ అడ్వైజరీ అమలు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను సులభతరం చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని కోరారు.
ఫ్లైఓవర్ నిర్మాణం, రహదారి అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత గచ్చిబౌలి–డీఎల్‌ఎఫ్ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సీపీ పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ సురేష్, సిఎంసి అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







