జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!

- June 10, 2026 , by Maagulf
జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!

జెడ్డా: జెడ్డా నగర తూర్పు ప్రాంతంలో మానవ వినియోగానికి పనికిరాని సుమారు 20 టన్నుల పాడైన ఆహారాన్ని జెడ్డా మున్సిపాలిటీ అధికారులు ధ్వంసం చేశారు. అలాగే,  ఆరోగ్య మరియు మున్సిపల్ నిబంధనలను పాటించని ఒక అనధికారిక పేస్ట్రీ మరియు స్వీట్ల తయారీ యూనిట్‌ను అధికారులు మూసివేశారు.

నివాస భవనంలో అనధికారికంగా నడుస్తున్న ఒక తయారీ యూనిట్‌ను తనిఖీ బృందాలు గుర్తించాయని మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ యాసర్ బిన్ సిరాజ్ బక్ష్ తెలిపారు.  అక్కడ నుండి పాడైపోయిన ముడి సరుకులు మరియు ఆహార పదార్థాలను గుర్తించి, సీజ్ చేశారు.  మానవ వినియోగానికి పనికిరాకపోవడంతో అక్కడ లభించిన ఆహార పదార్థాలన్నింటినీ, అలాగే తయారీకి ఉపయోగించిన పరికరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యే వరకు ఆ కేంద్రాన్ని పూర్తిగా మూసివేసినట్లు పేర్కొన్నారు.

ప్రజా ఆరోగ్యం మరియు వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ కార్యకలాపాలను పర్యవేక్షించడం, అరికట్టడం వంటి చర్యలు జెడ్డా మున్సిపాలిటీ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఉంటాయని మున్సిపాలిటీ డైరెక్టర్ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com