2026 ఫిఫా వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ వేడుకలకు శ్రీకారం..
- June 10, 2026
జ్యూరిచ్: 2026 ఫిఫా వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభోత్సవ వేడుకలు బుధవారం మూడు ఆతిథ్య నగరాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఫిఫా ప్రకటించింది. టోరంటో (కెనడా), మెక్సికో సిటీ (మెక్సికో), లాస్ ఏంజెల్స్ (అమెరికా) నగరాల్లో ఏకకాలంలో ప్రత్యేక సంగీత కచేరీలు నిర్వహించి ప్రపంచకప్ ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 ఫిఫా వరల్డ్‌కప్ జూన్ 11, 2026న ప్రారంభమై జూలై 19 వరకు కొనసాగనుంది. ఈసారి తొలిసారిగా 48 జట్లు పాల్గొనే విస్తృత ఫార్మాట్లో టోర్నమెంట్ జరగనుంది.
ఫిఫా ప్రకటించిన తాజా కళాకారుల జాబితా ప్రకారం, టోరంటోలో కెనడాకు చెందిన ప్రముఖ మహిళా రాక్ బ్యాండ్ ది బీచెస్ ప్రదర్శన ఇవ్వనుంది. మెక్సికో సిటీలో జరిగే కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ టెనర్ ఆండ్రియా బోచెల్లీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. లాస్ ఏంజెల్స్‌లో పాప్ గాయని ఆవా మ్యాక్స్, ర్యాపర్ బీఐఏ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
గ్రామీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కచేరీల్లో 2026 వరల్డ్‌కప్ అధికారిక ఆల్బమ్‌కు చెందిన అంతర్జాతీయ కళాకారులు పాల్గొననున్నారు. అదనంగా ప్రత్యేక అతిథుల ప్రదర్శనలు, మూడు నగరాలను అనుసంధానించే ప్రత్యక్ష ఇంటరాక్టివ్ కార్యక్రమాలు కూడా ఉండనున్నాయి.
ఈ కచేరీలకు అభిమానులు ఇంకా టికెట్లు పొందవచ్చని ఫిఫా వెల్లడించింది. అలాగే ఈ కార్యక్రమాలను ఫిఫా అధికారిక డిజిటల్, స్ట్రీమింగ్ వేదికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
2026 ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది ముందు నిర్వహిస్తున్న ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచనున్నాయి.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- ఖతార్ లో 8 ప్రాంతాల్లో క్లీనప్ డ్రైవ్ షెడ్యూల్..!!
- కువైట్లోడిజిటల్ చెల్లింపుల వైపు ప్రజల మొగ్గు..!!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్ బ్రాంకో కార్ల రీకాల్..!!
- చైనా-ఒమన్ మధ్య కీలక ఒప్పందాలు..!!
- హార్ముజ్ జలసంధి తెరవడం పై ఇరాన్ కీలక ప్రకటన







