పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యాధునిక గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలు
- June 10, 2026
-నూతన విభాగాలను లాంఛనంగా ప్రారంభించిన అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత
-కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని ప్రశంసలు
-ప్రపంచ స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే లక్ష్యమని డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు వెల్లడి
-కార్పొరేట్ క్వాలిటీ.. ఎఫర్డబుల్ రియాలిటీ” నినాదంతో ముందుకెళుతున్నానని డాక్టర్ ఆకాష్ పల్లెం ప్రకటన
విజయవాడ: విజయవాడలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాల ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ముఖ్య అతిథిగా హాజరై విభాగాలను ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి వైద్య సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.ఈ సందర్భంగా డీసీపీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమని అన్నారు. మహిళల ఆరోగ్యం, ఎముకల సమస్యలకు ప్రత్యేక వైద్య విభాగాలను ఒకే వేదికపై అందుబాటులోకి తేవడం సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడం అభినందనీయమని ప్రశంసించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పల్లెం పెద్దేశ్వరరావు మాట్లాడుతూ, 1999లో 20 పడకల ఆసుపత్రిగా ప్రారంభమైన తమ ప్రయాణం ప్రజల విశ్వాసంతో నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిటికల్ కేర్ సెంటర్‌గా ఎదిగిందన్నారు. ప్రస్తుతం 150 పడకలు, 8 ఐసీయూలు, 100 క్రిటికల్ కేర్ బెడ్లతో అత్యాధునిక వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. గత రెండున్నర దశాబ్దాలుగా లక్షలాది మంది రోగులకు సేవలందించామని, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ట్రామా వంటి విభాగాల్లో నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. హాస్పిటల్ సీఈవో డాక్టర్ ఆకాష్ పల్లెం మాట్లాడుతూ, “కార్పొరేట్ క్వాలిటీ.. ఎఫర్డబుల్ రియాలిటీ” నినాదంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలోనే అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ సెంటర్‌గా పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్‌ను తీర్చిదిద్దామని తెలిపారు. గైనకాలజీ విభాగం ద్వారా మహిళలకు సమగ్ర ఆరోగ్య సేవలు, పీసీఓడీ/పీసీఓఎస్ చికిత్సలు, సురక్షిత ప్రసవ సేవలు అందించనున్నామని చెప్పారు. అలాగే ఆర్థోపెడిక్స్ విభాగంలో ట్రామా కేర్, ఫ్రాక్చర్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ ఇంజరీ ట్రీట్మెంట్, పోస్ట్ సర్జికల్ రిహాబిలిటేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ప్రజలకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ సంకల్పమని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభించిన గైనకాలజీ విభాగంలో గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ జాహ్నవి అన్నే, ఆర్థోపెడిక్స్ విభాగంలో శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ భరత్ చంద్ సేవలందిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు, పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ వైద్యులు, సిబ్బంది, పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..
- ‘క్లాడ్ ఫేబుల్ 5’ను విడుదల చేసిన ఆంత్రోపిక్.. భద్రత, పనితీరు పై ప్రత్యేక దృష్టి
- ఇంటెల్లి స్మార్ట్ను కొనుగోలు చేస్తున్న అదానీ ఎనర్జీ.. రూ.3,050 కోట్ల ఒప్పందం
- మల్కాజ్గిరి కమిషనర్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- ప్రభుత్వ సేవల కోసం ఆన్లైన్లో మరో యాప్: సీఎం చంద్రబాబు
- ETCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- నేరగాళ్ల పై ఉక్కుపాదం మోపుతామన్న డీజీపీ సీవీ ఆనంద్
- అజ్మాన్‌లో తుంబే ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన..వైద్య పరిశోధనలకు కొత్త దిశ
- FTPC ఇండియా మేకోవర్ కమిటీ చైర్మన్‌గా బొలిశెట్టి ప్రణవి నియామకం
- 2026 ఫిఫా వరల్డ్‌కప్ కౌంట్‌డౌన్ వేడుకలకు శ్రీకారం..









