నార్త్ అల్ బతినాలో భారీగా చ్యూవింగ్ టోబాకో సీజ్..!!
- June 11, 2026
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని వినియోగదారుల రక్షణ డైరెక్టరేట్ జనరల్ భారీ మొత్తంలో చ్యూవింగ్ టోబాకో ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. విదేశీ కార్మికులు ఒక ప్రదేశంలో పొగాకు మరియు దాని అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలు, పంపిణీ కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు జరిపినట్లు డైరెక్టరేట్ తెలిపింది.
2,200 సంచులు నిషేధిత ఉత్పత్తులతో పాటు వాటి తయారీ మరియు ప్యాకేజింగ్‌కు ఉపయోగించే సామగ్రి, నగదును భారీ మొత్తంలో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు నగదును, కేసు ఫైల్‌ను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.
నిషేధిత వస్తువులు మరియు ఉత్పత్తుల చలామణిని అరికట్టడానికి నియంత్రణ చర్యలను కొనసాగిస్తామని వినియోగదారుల రక్షణ అథారిటీ స్పష్టం చేసింది. ఏవైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల గురించి సమాచారం అందించడం ద్వారా ప్రజలు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







