వీసా ఫీజులు, ట్రాఫిక్‌ జరీమానాల పెంపు

- August 09, 2016 , by Maagulf
వీసా ఫీజులు, ట్రాఫిక్‌ జరీమానాల పెంపు

సౌదీ అరేబియా క్యాబినెట్‌, వీసా ఫీజుల్ని, ట్రాఫిక్‌ జరీమానాల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఖజనాకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయాల్ని తీసుకున్నారు. వారం వారం జరిగే క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌, మినిస్రీ& టాఫ్‌ ఎకానమీ అండ్‌ ప్లానింగ్‌ ద్వారా వచ్చిన ప్రపోజల్స్‌కి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నాన్‌ ఆయిల్‌ సెక్టార్‌లో ఆదాయం పెంచుకునే దిశగా ఈ నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. వన్‌ ఎంట్రీ వీసా ఫీజు 2,000 సౌదీ రియాల్స్‌కి పెంచారు. ఆరు నెలల మల్టీ ఎంట్రీ వీసా ఖరీదు 3,00 సౌదీ రియాల్స్‌. 12 నెలల వీసా ఖరీదు 5,000 సౌదీ రియాల్స్‌ కాగా, 24 నెలల వీసా ఖరీదు 8,000 సౌదీ రియాల్స్‌గా నిర్ధారించారు. ట్రాన్సిట్‌ వీసా ఇకపై 300 సౌదీ రియాల్స్‌ కానుంది. కింగ్‌డమ్‌ నుంచి సీపోర్ట్‌ ద్వారా బయటకు వెళ్ళాలనుకుంటున్నవారు 50 సౌదీ రియాల్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులు, సింగిల్‌ ట్రిప్‌ అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటే (రెండు నెలలకు తక్కువ కాకుండా) 200 సౌదీ రియాల్స్‌ చెల్లించకతప్పదు. మూడు నెలల మల్టిపుల్‌ ట్రిప్‌కి 500 సౌదీ రియాల్స్‌, అదనంగా ప్రతి నెలకీ 200 సౌదీ రియాల్స్‌ చెల్లించాలి. కొత్త హిజ్రి ఇయర్‌ నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. ట్రాఫిక్‌ జరీమానాల విషయానికి వస్తే, డ్రిఫ్టింగ్‌కి పాల్పడేవారికి తొలిసారి అయితే 20,00 సౌదీ రియాల్స్‌ జరీమానా, కోర్టుకు పంపించడం, వాహనాన్ని 15 రోజులపాటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇదే నేరం రిపీట్‌ అయితే 40,000 సౌదీ రియాల్స్‌, కోర్టుకు రిఫర్‌ చేయడం, వాహనాన్ని నెల రోజులపాటు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. మూడోసారి నిబంధనల్ని ఉల్లంఘిస్తే 60,000 సౌదీ రియాల్స్‌ జరీమానా విధిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com