ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!

- June 12, 2026 , by Maagulf
ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!

మస్కట్: ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభమైంది. వాహన సాంకేతిక తనిఖీ సేవలను విస్తరించడంలో భాగంగా రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఒమన్ సుల్తానేట్ లో మొట్టమొదటి ప్రైవేట్ వాహన సాంకేతిక తనిఖీ కేంద్రం కోసం అక్రిడిటేషన్ ప్రక్రియలను పూర్తి చేసింది. ఈ కేంద్రాన్ని జూన్ 16న ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రారంభించనున్నారు.

ప్రజా సేవలను అందించడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచడం, అదే సమయంలో దేశవ్యాప్తంగా వాహన తనిఖీ సౌకర్యాల లభ్యతను విస్తరించడం ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగం మధ్య భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడం వంటి విస్తృత ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని తెలిపారు. ప్రైవేట్ తనిఖీ కేంద్రాలకు అక్రిడిటేషన్ ఇవ్వడం ద్వారా నిరీక్షణ సమయం తగ్గుతుందన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com