హైమా ప్రమాదంలో ఐదుగురి మృతి

- August 09, 2016 , by Maagulf
హైమా ప్రమాదంలో ఐదుగురి మృతి

నలుగురు ఒమనియన్లు, ఒక ఇతియోపియన్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, కార్గోట్రక్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విలాయత్‌ ఆఫ్‌ హైమా, అల్‌ వుస్తా గవర్నరేట్‌ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చనిపోయినవారిలో నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు. మరో వ్యక్తి, ఆ కుటుంబానికి హౌస్‌మెయిడ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వేగంగా వెళుతున్న కారు ప్రమాదానికి గురవడానికి గల కారణాల్ని చెబుతూ, ఆ సమయంలో కారు టైర్‌ పేలడంతో, అది అదుపుతప్పి కార్గో ట్రక్‌ని ఢీకొన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలంలోనే అందరూ మృతి చెందారు. చనిపోయినవారిలో 14 ఏళ్ళలోపు చిన్నారులు ఇద్దరు ఉన్నారు. ట్రక్‌ డ్రైవర్‌ మాత్రం చిన్న గాయాలతో బయటపడ్డాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com