‘పెద్ది’ చిత్ర బృందాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
- June 12, 2026
రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ‘పెద్ది’ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు, చిత్ర బృంద సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం 350 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
రెండో వారంలో కూడా కలెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి. రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతోంది.
‘పెద్ది’లో రామ్ చరణ్ నటనపై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలతో కూడిన నటన అందరినీ కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘పెద్ది’ రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









