ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌..

- August 10, 2016 , by Maagulf
ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌..

 ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌ ప్రకటించింది. టిక్కెట్‌ ధర తక్కువగా రూ.806కే ఇస్తున్నట్లు తెలిపింది. దేశీయంగా మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 30 వరకు ఈ ఆఫర్‌తో ప్రయాణం చెయ్యొచ్చు. ఆఫర్‌ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందో ఇండిగో వెబ్‌సైట్‌లో వెల్లడించలేదు. అలాగే ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో కూడా స్పష్టంచేయలేదు. ఇండిగో వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్‌కు టిక్కెట్‌ రూ.806 ఉంది. ఈ ఆఫర్‌ కింద ఇతర మార్గాల్లో దిల్లీ-జైపూర్‌ రూ.908, చెన్నై- బెంగళూరు రూ.976, బెంగళూరు-కొచ్చి రూ.1,137కు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com