ఓ డైరెక్టర్ ను నమ్మి ఓ యువకుడు 6 లక్షలు సమర్పించుకున్న ఘటన
- August 10, 2016
సినిమా అనేది రంగుల ప్రపంచం..దీని నమ్ముకొని పైకి వచ్చినవారు కొంతమంది అయితే బిచ్చగాడిలా మారిపోయింది చాల మందే. కొంతమంది సినిమాపిచ్చోళ్ళు ఉంటారు సినిమాలలో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ, డైరెక్టర్ల చుట్టూ చెప్పులరిగేలా తీరుగుతుంటారు. ఈరోజుల్లో హీరోగా అవకాశం రావాలంటే సినిమా నిర్మాత కొడుకో లేదా సినిమా పరిశ్రమ కు సంబధించిన వారికే తప్ప బయట వారికీ ఛాన్స్ వచ్చే ఛాన్సులేదు. ఇటువంటి తరుణం ఓ డైరెక్టర్ ను నమ్మి ఓ యువకుడు 6 లక్షలు సమర్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
నెల్లూరుకు చెందిన మురళీధర్ రెడ్డి అనే యువకుడికి వాసుదేవనాయుడు అనే వ్యక్తి తో పరిచయమయ్యాడు. తను సినీ దర్శకుడినని షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వచ్చానని మురళితో చెప్పాడు..వారి మధ్య కొన్ని రోజుల్లోనే స్నేహం బాగా పెరగడం తో నేను డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నువ్వే హీరోవి అంటూ మురళీధర్ రెడ్డికి వాసుదేవనాయుడు నమ్మబలికాడు. సినిమా సెట్స్ ఫైకి వెళ్లాలంటే నువ్వు కాస్త డబ్బు సర్దుబాటు చేయాలనీ చెప్పడం తో మురళీధర్ రెడ్డి ఆ దర్శకుడికి రూ.6 లక్షలు సమర్పించుకున్నాడు.కట్ చేస్తే హైదరాబాద్ కు వచ్చిన వాసుదేవనాయుడు బిట్రగుంట అనే సినిమాను తీస్తున్నట్టు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాడు. ఆ సినిమాలో హీరోగా వేరే యువకుడ్ని ప్రకటించాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన మురళీధర్ రెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వాసుదేవనాయుడిపై పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాడు. ప్రస్తుతం పోలీసులు ఆ పనిలో పడ్డారు..ఇలాంటి మురళి రెడ్డి లు చాల మందే ఉన్నారు. కాకపోతే వారు బయటకు రాలేదు ఇతడు వచ్చాడు అంతే.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







