AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- June 14, 2026
దోహా: AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు ఖతార్ సివిల్ సర్వీస్ మరియు ప్రభుత్వ అభివృద్ధి బ్యూరో (CGB) 'ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అనే పేరుతో ఒక ప్రత్యేక శిక్షణా వర్క్‌షాప్‌ను నిర్వహించింది. సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ (MCIT) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం.. వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రాజెక్ట్ నిర్వహణలో అత్యాధునిక నైపుణ్యాలపై అవగాహన కల్పించనున్నారు.
ప్రాజెక్ట్ నిర్వహణ రంగాన్ని వేగంగా మారుస్తున్న AI గురించి పాల్గొనేవారు లోతుగా తెలుసుకునేందుకు వీలుగా శిక్షణను అందించనున్నారు. ఆధునిక ప్రాజెక్ట్ నిర్వహణలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంపై ఈ శిక్షణ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సంక్లిష్టమైన డేటాసెట్‌లను విశ్లేషించడానికి బిగ్ డేటా మరియు ఏఐ అల్గారిథమ్‌లను ఉపయోగించుకునే పద్ధతులను పరిచయం చేస్తారు. ఈ విధానం ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలులో సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను పెంపొందిస్తుందని భావిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలలో రోజువారీ కార్యకలాపాలలో ఏఐ (AI) పరిష్కారాలను అనుసంధానించడం ద్వారా.. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ పనులను మరింత సమర్థవంతంగా చేస్తారని సీజీబీ తెలిపింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









