Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- June 14, 2026
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 అరైవల్స్ ప్రాంతంలో ఒక GCC జాతీయ ప్రయాణికుడు తన బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. వెంటనే దుబాయ్ పోలీసులు ఫిర్యాదు చేయగా, వారు సీసీ ఫుటేజీ సాయంతో కొనుగొని ప్రయాణికుడికి తిరిగి అప్పగించారు. ఆ బ్యాగ్‌లో లగ్జరీ వాచీలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయని DXB టెర్మినల్ 1 సెక్యూరిటీ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా ఫైసల్ అల్ దోసరి వెల్లడించారు.
ప్రయాణికుడి నుండి లాస్ట్ అండ్ ఫౌండ్ కార్యాలయానికి ఫిర్యాదు అందిందని, వెంటనే ప్రయాణికుడి కదలికలను సమీక్షించి, పోగొట్టుకున్న వస్తువు కోసం వెతకడానికి ఒక ప్రత్యేక టీమ్ ను నియమించినట్లు తెలిపారు. ఆ బ్యాగ్‌ను టెర్మినల్ ప్రాంతంలో గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. బ్యాగ్ లో ఒక ల్యాప్‌టాప్ మరియు ఒక టాబ్లెట్‌తో పాటు, మొత్తం 103,880 దిర్హమ్ల విలువైన మూడు లగ్జరీ వాచీలు అందులో ఉన్నట్లు గుర్తించామని దోసరి తెలిపారు. ధృవీకరణ మరియు చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత, ఆ వస్తువులను అసలైన యజమానికి తిరిగి అప్పగించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతను తెలియజేశాడు. ప్రయాణికుల ఆస్తులను పరిరక్షించడంలో, పోగొట్టుకున్న వస్తువులను వాటి అసలైన యజమానులకు తిరిగి ఇవ్వడంలో వారి నిబద్ధతను ప్రశంసించారు.
ప్రయాణికులు పోగొట్టుకున్న విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంలో దుబాయ్ పోలీసులు పలుమార్లు వేగవంతమైన చర్యలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఫ్లైట్ బయలుదేరడానికి ముందే పోగొట్టుకున్న $20,000 నగదు మరియు బంగారం ఉన్న బ్యాగ్‌ను వెంటనే గుర్తించి, విమానం బయలుదేరే సమయంలోపు తిరిగి అందించి ప్రశంసలు అందుకున్నారు. 2025లో 1,71,490 పోగొట్టుకున్న వస్తువులను వాటి యజమానులకు తిరిగి అప్పగించారు.
ఇదిలా ఉండగా, దుబాయ్ వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు మరియు షాపింగ్ సెంటర్లు, స్మార్ట్ పోలీస్ స్టేషన్లు (SPS) వంటి ఆమోదిత డ్రాప్-ఆఫ్ పాయింట్ల వద్ద 1,59,962 పోగొట్టుకున్న వస్తువుల రిపోర్టులు నమోదయ్యాయి. ప్రజలు పోగొట్టుకున్న వస్తువులను నివేదించడం మరియు అప్పగించడం సులభతరం చేయడానికి అధికారులు ఇతర ఆధునిక మార్గాలను కూడా ఉపయోగిస్తూ నివాసితులు, ప్రజలు, టూరిస్టుల ప్రశంసలు అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









