కశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ పాత్ర..

- August 10, 2016 , by Maagulf
కశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ పాత్ర..

భద్రతా దళాలకు మరో కసబ్ చిక్కాడు. కశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మరింత కల్లోలం సృష్టించేందుకు పాక్ పన్నిన పన్నాగాన్ని పట్టుబడిన ఉగ్రవాది పూసగుచ్చినట్టు వివరించాడు. తాజాగా భద్రతా దళాల చేతికి చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు మౌలానా అబ్దుల్ రహీం, బహదూర్ అలీలను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఎన్ఐఏ విచారణలో ఉగ్రవాది బహదూర్ అలీ పలు విస్మయ పరిచే వివరాలు వెల్లడించాడు. తనకు భారతీయులు అంటే ఇష్టముండదని, వారిని చంపేందుకే భారత్‌లో చొరబడ్డానని పేర్కొన్నాడు. కశ్మీర్‌లోని ప్రస్తుత కల్లోల పరిస్థితులను పాక్ అనుకూలంగా మార్చుకోవాలని భావించందని తెలిపాడు. పాక్‌లోనే తాను శిక్షణ పొందానని వివరించాడు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించింది. ఉగ్రవాదుల నుంచి భారీగా బాంబులు, మారణాయుధాలు, రూట్ మ్యాప్‌లు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బహదూర్ అలీ తమ కస్టడీలో ఉన్నట్టు తెలిపిన అధికారులు, అతడి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోనేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ సహా పాక్‌లోని చాలా ప్రాంతాల్లో 30-50 మంది ఉగ్రవాదులకు లష్కరే తాయిబా శిక్షణ ఇస్తున్నట్టు అలీ పేర్కొన్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. జూన్ 11, 12 తేదీల్లో అలీ భారత్‌లో చొరబడి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కశ్మీర్ అల్లర్ల వెనుక పాక్ పాత్ర ఉన్నట్టు స్పష్టమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com