అభిజీత్ దిప్కే పై దాడి..
- June 15, 2026
సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చి, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహిస్తున్న ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనపై ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
NEET పరీక్షల అక్రమాలపై నిరసన వేళ ఘోరం
దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీ జైపూర్‌లోని అమరవీరుల స్మారక మందిరం (శహీద్ స్మారక్) సమీపంలో ఒక భారీ ధర్నాను చేపట్టింది. ఈ నిరసనలో పాల్గొనడానికి అభిజీత్ దీప్కే వేదికపైకి రాగానే, అక్కడే మాటువేసిన ఒక గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా ఆయనపై భౌతిక దాడికి దిగాడు.
ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన అభిజీత్ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు తక్షణమే స్పందించి దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకుని చితకబాదారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? దాడికి గల కారణాలేమిటి? అనే విషయాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.
Cockroach Janata Party: సోషల్ మీడియా సెన్సేషన్ నుండి దేశవ్యాప్త ఉద్యమం వరకు..
కేవలం ఒక చిన్న మాటతో, వ్యంగ్య (Satirical) ఉద్యమంగా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’, కొన్ని రోజుల్లోనే కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుని దేశంలోనే అతిపెద్ద యువజన శక్తులలో ఒకటిగా ఎదిగింది. నిరుద్యోగం, పరీక్షల లీకేజీలు, ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా ప్రశ్నిస్తూ ఈ పార్టీ యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పటికే నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించిన ఈ పార్టీ, తాజాగా జైపూర్‌లో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే పార్టీ అధినేతపై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









