యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- June 15, 2026
రియాద్: రియాద్‌లోని జీసీసీ జనరల్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ను జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ అల్బుదైవి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల మధ్య న్యాయ నైపుణ్యాల మార్పిడిని మెరుగుపరచడం, శాసనపరమైన సమన్వయం మరియు ఇంటిగ్రేషన్ ను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక వ్యూహాత్మక వేదికగా ఇది సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం, ఈ వేదిక 24,700కు పైగా చట్టపరమైన మరియు శాసనపరమైన పత్రాలను కలిగి ఉందన్నారు. అధునాతన శోధన సామర్థ్యాలను అందిస్తుందని, ఈ ఫీచర్లు సభ్య దేశాలలోని ప్రభుత్వ మరియు న్యాయ సంస్థలతో పాటు శాసన వ్యవహారాలపై ఆసక్తి ఉన్న నిపుణులు, పరిశోధకులు మరియు వ్యక్తులకు ప్రయోజనం పొందడానికి వీలు కల్పిస్తుందన్నారు.
జాతీయ శాసనాల కోసం ఉద్దేశించిన ఈ ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ మొదటి దశలో బహ్రెయిన్ మరియు ఒమన్ దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, జనరల్ సెక్రటేరియట్‌లోని సంబంధిత అధికారులు తదుపరి దశలలో మిగిలిన సభ్య దేశాలతో ఇంటిగ్రేషన్ ను పూర్తి చేయడానికి ప్రయత్నాలను కొనసాగుతున్నాయని జీసీసీ సెక్రటరీ జనరల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







