ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

- June 16, 2026 , by Maagulf
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఫలితాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. కార్యక్రమం అమలు తీరు, ప్రజలకు అందిన సేవలు, శాఖల పనితీరుపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోడ్డు భద్రత కోసం "అరైవ్ అలైవ్", మహిళలు మరియు చిన్నారుల భద్రత, అలాగే మాదకద్రవ్యాల నియంత్రణ (యాంటీ నార్కోటిక్స్) అంశాలపై మూడు ప్రధాన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. గత 99 రోజులుగా నిర్వహించిన కార్యక్రమాలు, వాటి ద్వారా సాధించిన ఫలితాలు, ప్రజల్లో ఏర్పడిన అవగాహన గురించి సమగ్ర నివేదికను సమర్పించారు.

ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసిన శాఖలను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, అధికారులు తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని ఆదేశించారు.

అలాగే ప్రజలతో ప్రభుత్వానికి మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో నిర్వహించిన గ్రామ సభల్లో తెలంగాణ పోలీసు శాఖ చురుకుగా పాల్గొని, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిందని అధికారులు వివరించారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవల అందుబాటు పెరగడంతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి వేగం పెరిగిందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఈ కార్యక్రమంలో డీజీపీ సి.వి.ఆనంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com