దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- June 17, 2026
జూన్ 25 వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్ - TOMCOM) దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు మరియు బైక్ రైడర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా టామ్‌కామ్ పేర్కొంది.
టామ్‌కామ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి నెలకు AED 2,500 నుంచి AED 4,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.64,850 నుంచి రూ.1,03,770 వరకు ఉంటుంది.
అలాగే బైక్ రైడర్ ఉద్యోగానికి నెలకు AED 2,500 వరకు (సుమారు రూ.64,850) సంపాదించే అవకాశం ఉందని తెలిపింది.
అయితే ఈ రెండు ఉద్యోగాలు 100 శాతం కమిషన్ ఆధారితంగా ఉంటాయని టామ్‌కామ్ స్పష్టం చేసింది. ఉద్యోగుల ఆదాయం వారి వ్యక్తిగత పనితీరు, పూర్తి చేసిన ట్రిప్పుల సంఖ్య, అలాగే సాధించిన రెవెన్యూ స్లాబ్‌పై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది.
ఈ ఉద్యోగాలకు 23 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు ప్రాథమిక స్థాయి ఆంగ్ల భాష మాట్లాడే, చదివే నైపుణ్యాలు కలిగి ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 25లోపు దరఖాస్తు చేసుకోవాలని టామ్‌కామ్ సూచించింది.
మరిన్ని వివరాల కోసం టామ్‌కామ్ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.

తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









