హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!

- June 17, 2026 , by Maagulf
హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!

మస్కట్: హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రత బలోపేతం కోసం ఒమన్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ స్పష్టం చేశారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీలో టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మంచి పొరుగు సంబంధాలను కొనసాగించాలని, ప్రాంత ప్రజలను ఏకం చేసే చారిత్రక, సాంస్కృతిక బంధాల ఆధారంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఉమ్మడిగా నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించారు. 

ఇటీవల కుదిరిన యూఎస్-ఇరాన్ అవగాహనల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన మరియు స్వేచ్ఛాయుతమైన సముద్రయానానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టానికి తమ దేశాలు కట్టుబడి ఉంటామని ఇద్దరు మంత్రులు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుతూ నిర్మాణాత్మక రాజకీయ, దౌత్య మార్గానికి అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాబోయే కాలంలో అన్ని పక్షాలు తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com