ఇండియన్ మ్యాన్‌కి 1 మిలియన్ జాక్‌పాట్
- August 10, 2016
మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తికి ఇకె521, 0845 నెంబర్లు అత్యంత లక్కీగా మారాయి. ఇటీవల ప్రమాదానిక తీఇగురైన ఎమిరేట్స్ విమానంలో మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదర్ ప్రయాణించాడు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ - దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కాంకర్స్ ఎ వద్ద నిర్వహించిన డ్రాలో అతని టిక్కెట్ 0845కి బంపర్ ఆఫర్ తగిలింది. ఈ బహుమతి విలువ ఎంతో తెలుసా? 1 మిలియన్ డాలర్లు. అంటే 3.67 మిలియన్ దిర్హామ్‌లు. 62 ఏళ్ళ ఖాదర్, ఈద్ సందర్భంగా కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం టిక్కెట్ కొనుగోలు చేశాడు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డంపై స్పందిస్తూ, దేవుడే తనను ఆ ప్రమాదం నుంచి గట్టెక్కించాడని మొహమ్మద్ బషీర్ చెప్పారు. 37 ఏళ్ళుగా తాను దుబాయ్‌లో నివసిస్తున్నట్లు వివరించారాయన. రిటైర్‌మెంట్ తర్వాత తాను ఇండియాలో సెటిలవుతానని అన్నారు బషీర్. 1 మిలియన్ డాలర్ల బహుమతి గెలవడం పట్ల ఆయన పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదల కష్టాలు తనకు తెలుసనీ, ఎందుకంటే తానూ ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించాననీ, తనకు లభించిన బహుమతి సొమ్ముతో వీలైనంతవరకు పేదలకు సహాయపడేందుకు ఉపయోగిస్తానని అన్నారాయన.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







