భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అబుదాబీ సిద్ధం
- August 10, 2016
భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అబుదాబీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ ఏర్పాట్లు చేస్తోంది. అబుదాబీ టూరిజం అండ్ కల్చర్ అథారిటీ (టిసిఎ), డెడికేటెడ్ ఇండియన్ సీజన్‌ని అబుదాబీ సమ్మర్ సీజన్ (ఎడిఎస్‌ఎస్)ని ఏర్పాటు చేసింది. ఇండియన్ కమ్యూనిటీని ఎట్రాక్ట్ చేసేందుకుగాను పలు కార్యక్రమాల్ని చేపడ్తోంది. ఎడిఎస్‌ఎస్ నిర్వాహకులు, ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని, పాపులర్ కమెడియన్లు, సింగర్స్‌తో ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ, ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఆగస్ట్ 12న అల్ రహా బీచ్ థియేటర్‌లో కపిల్ శర్మ షో ఉంటుంది. ఆగస్ట్ 11న ఎమిరేట్స్ ప్యాలెస్‌లో బాలీవుడ్ సింగర్ షాన్ మ్యూజికల్ పెర్ఫామెన్స్ ఉంటుంది. ఆగస్ట్ 12న విషాల్ దద్లానీ, షేకర్ రవ్‌జియానీ షో, ఆగస్ట్ 13న శంకర్ మహదేవన్, ఎహ్‌సాన్ నూరాని, లాయ్ మెండోన్సా షో ఉంటుంది. గత సమ్మర్‌లో నిర్వహించిన కార్యక్రమాలతో పోల్చితే ఈ సారి ఇంకా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించనున్నామనీ ఈ సీజన్ జులై 7న ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు కొనసాగుతుందని అబుదబీ కన్వెన్షన్ బ్యూరో డైరెక్టర్ ముబారక్ అల్ షమ్సి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







