‘పెద్ది’లో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు జోడింపు
- June 18, 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి విజయవంతంగా రన్ అవుతోంది. రెండు వారాలుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ పలు రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి మరింత బలంగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు కొత్త సన్నివేశాలను జోడిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి ప్రేక్షకులు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త ఫుటేజ్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. కొత్త సన్నివేశాలు రిపీట్ ఆడియన్స్ మరింత అలరించనున్నాయి.
అంతేకాకుండా, ఈ చిత్రం గురువారం నుంచి రెగ్యులర్ టికెట్ ధరలతో అందుబాటులోకి రానుంది. టికెట్ ధరల తగ్గింపు ఫ్యామిలీ ఆడియన్స్ ను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అద్భుతమైన మౌత్ పబ్లిసిటీ, రికార్డు స్థాయి వసూళ్లు, అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్న అద్భుతమైన ప్రదర్శనతో ‘పెద్ది’ ఇప్పటికే 2026లో అతిపెద్ద దక్షిణాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు కొత్త సన్నివేశాల జోడింపు, సాధారణ టికెట్ ధరలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను మరింత కాలం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. అలాగే, రామ్ చరణ్ సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పెద్ది’ కొత్త చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









