కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్‌లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- June 19, 2026
రియాద్: కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్ డెవలప్మెంట్ అథారిటీ రిజర్వ్ జీవవైవిధ్య జాబితాలో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులను చేర్చినట్లు నమోదు చేసింది. దీంతో, నమోదైన మొత్తం పక్షి జాతుల సంఖ్య 225కు పెరిగాయి. రిజర్వ్‌లో నమోదైన పక్షి జాతుల వైవిధ్యంలో ఇది 15 శాతం పెరుగుదల అని రిజర్వ్ అథారిటీ తెలిపింది. రిజర్వ్ సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పర్యవేక్షణ సామర్థ్యాన్ని నిరంతరం మెరుగుపరుస్తున్నామని, జీవవైవిధ్య నమోదులో కచ్చితత్వాన్ని పెంచడంతో ఈ విజయం సాధ్యమైందని అథారిటీ వివరించింది. రిజర్వ్ పర్యావరణ పర్యవేక్షణ కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయని, ఈ కొత్త ఆవిష్కరణలు ఆ విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అథారిటీ ప్రతినిధి అబ్దుల్ అజీజ్ అల్-ఫురైహ్ తెలిపారు.
మొట్టమొదటిసారిగా నమోదు చేసిన ముఖ్యమైన జాతులలో రూపెల్ రాబందు, అరుదైన రెడ్ ఫాలరోప్, పెక్టోరల్ సాండ్‌పైపర్ ఉన్నాయి. వీటితో పాటు రోజ్-కలర్డ్ స్టార్లింగ్, ఎల్లో వాగ్‌టెయిల్, యూరేషియన్ స్కైలార్క్, సాంగ్ థ్రష్ వంటి వలస మరియు అరుదైన పక్షులు కూడా ఉన్నాయని తెలిపారు.IUCN రెడ్ లిస్ట్‌లో అధిక పరిరక్షణ విలువ కలిగిన జాతుల నమోదును కూడా ధృవీకరించారు. వీటిలో ముఖ్యంగా, తీవ్రంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఆఫ్రికన్ రాబందుతో పాటు అంతరించిపోయే ప్రమాదం అంచున ఉన్న వెస్ట్రన్ ఓర్ఫియన్ వార్బ్లర్ మరియు వైట్-వింగ్డ్ లార్క్ వంటి జాతులు కూడా ఉన్నాయని వివరించారు.
తాజా వార్తలు
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్‌లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్‌లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్‌లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాల పై చర్చించిన ఒమన్, జర్మనీ..!!









