కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- June 19, 2026
కువైట్: కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తిని యుద్ధానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించాలని కువైట్ ఆశిస్తున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) సీఈఓ షేక్ నవాఫ్ అల్-సబాహ్ తెలిపారు. కువైట్ ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించిందని, వారం రోజుల్లోనే ఉత్పత్తి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను మించిపోతుందని ఆశిస్తున్నట్లు షేక్ నవాఫ్ చెప్పారు.
కువైట్ ఓడరేవులకు అంతర్జాతీయ వాణిజ్య నౌకా రవాణా సేవలు అందుబాటులో ఉండటాన్ని బట్టి, రాబోయే వారాల్లో కువైట్ యుద్ధానికి ముందున్న ఉత్పత్తి స్థాయి అయిన రోజుకు సుమారు 2.5 మిలియన్ బ్యారెళ్లకు తిరిగి రాగలదని ఆయన తెలిపారు.
యుద్ధ సమయంలో సరఫరా అంతరాయాలకు సంబంధించిన అన్ని ఫోర్స్ మేజర్ ప్రకటనలను తక్షణమే ఎత్తివేసినట్లు కేపీసీ అధిపతి ప్రకటించారు. ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా సరఫరాను పునరుద్ధరించేందుకు కేపీసీ వినియోగదారులతో కలిసి పనిచేస్తోందని షేక్ నవాఫ్ తెలిపారు.
అమెరికా-ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం కింద హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో చమురు రవాణాకు ఇబ్బందులు తొలిగాయి. అయితే, సముద్ర రవాణా సాధారణ స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చని షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం







