కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!

- June 19, 2026 , by Maagulf
కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!

కువైట్: కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తిని యుద్ధానికి ముందున్న స్థాయికి పునరుద్ధరించాలని కువైట్ ఆశిస్తున్నట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ (KPC) సీఈఓ షేక్ నవాఫ్ అల్-సబాహ్ తెలిపారు. కువైట్ ఇప్పటికే ఉత్పత్తిని పెంచడం ప్రారంభించిందని, వారం రోజుల్లోనే ఉత్పత్తి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను మించిపోతుందని ఆశిస్తున్నట్లు షేక్ నవాఫ్ చెప్పారు.

కువైట్ ఓడరేవులకు అంతర్జాతీయ వాణిజ్య నౌకా రవాణా సేవలు అందుబాటులో ఉండటాన్ని బట్టి, రాబోయే వారాల్లో కువైట్ యుద్ధానికి ముందున్న ఉత్పత్తి స్థాయి అయిన రోజుకు సుమారు 2.5 మిలియన్ బ్యారెళ్లకు తిరిగి రాగలదని ఆయన తెలిపారు.

యుద్ధ సమయంలో సరఫరా అంతరాయాలకు సంబంధించిన అన్ని ఫోర్స్ మేజర్ ప్రకటనలను తక్షణమే ఎత్తివేసినట్లు కేపీసీ అధిపతి ప్రకటించారు.  ప్రస్తుత ఒప్పందాలకు అనుగుణంగా సరఫరాను పునరుద్ధరించేందుకు కేపీసీ వినియోగదారులతో కలిసి పనిచేస్తోందని షేక్ నవాఫ్ తెలిపారు.

అమెరికా-ఇరాన్ తాత్కాలిక శాంతి ఒప్పందం కింద హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో చమురు రవాణాకు ఇబ్బందులు తొలిగాయి. అయితే, సముద్ర రవాణా సాధారణ స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చని షిప్పింగ్ కంపెనీలు చెబుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com