సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- June 20, 2026
యూఏఈ: అబుదాబిలోని సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీ లను నిషేధించారు. ఈ ఐస్లాండ్ ఒక సంరక్షిత సముద్ర ప్రాంతమని, ఇక్కడ అన్ని మోటారు నౌకలను నిషేధించినట్లు అబుదాబి మారిటైమ్ తెలిపింది. ఏవైనా ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
గత సంవత్సరం జూలైలో, దుబాయ్‌లోని అధికారులు అసురక్షిత సముద్ర కార్యకలాపాలపై చర్యల్లో భాగంగా జెట్ స్కీలను లక్ష్యంగా చేసుకుని ఒక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ఫలితంగా 431 ఉల్లంఘనలు నమోదు కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 41 జెట్ స్కీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో గడువు ముగిసిన జెట్ స్కీ లైసెన్సులు, ఈత కొలనులు మరియు హోటల్ బీచ్‌ల వంటి నిషేధిత ప్రాంతాలలోకి ప్రవేశించడం, అనుమతించిన సమయానికి మించి నడపడం, లైఫ్ జాకెట్లు ధరించకపోవడం, మైనర్లు వాటర్క్రాఫ్ట్ను ఉపయోగించడం మరియు ఓవర్లోడింగ్ వంటి ఉల్లంఘనలు ఉన్నాయి.
ఉల్లంఘనల తీవ్రతను బట్టి జరిమానాలు విధించినట్లు అధికారులు తెలిపారు. గడువు ముగిసిన లైసెన్సుతో నడిపినందుకు Dh1,000, లైఫ్ జాకెట్ లేదా హెల్మెట్ ధరించనందుకు Dh1,000, ఇతరులకు ఆటంకం కలిగించినా లేదా వేధించినా Dh2,000, మరియు నిర్దేశిత సముద్ర క్రీడా ప్రాంతాల నిబంధనలను పాటించనందుకు Dh1,000 జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!







