ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- June 20, 2026
దోహా: ఖతార్ మ్యూజియమ్స్ (QM), ప్రపంచవ్యాప్త సాంస్కృతిక మార్పిడిని ప్రేరేపించేలా రూపొందించిన ప్రదర్శనలు, ఓపెన్ కళా ప్రదర్శనలు మరియు కార్యక్రమాలతో కూడిన విస్తృతమైన ఫాల్ 2026 ను ప్రకటించింది. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో డజన్ల కొద్దీ ప్రదర్శనలు ఉన్నాయి. వాటిలో బాగ్దాద్ మోడరన్ ఆర్ట్ గ్రూప్ ప్రదర్శనలు,ప్రఖ్యాత ఇటాలియన్ సమకాలీన కళాకారుడు గియుసెప్పె పెనోన్ ప్రదర్శన, అరబ్ ఆతిథ్యంపై దృష్టి సారించిన 'బేటి బేటాక్ మై హోమ్ ఈజ్ యువర్ హోమ్' అనే ప్రదర్శన దోహాలో తొలిసారిగా ప్రదర్శించనున్నారు.
ఫ్యాషన్, డిజైన్ లకు ఖతార్ యొక్క సృజనాత్మక కేంద్రమైన M7 అనేక ప్రదర్శనలను అందిస్తుంది. దాదాపు 500 కంటే ఎక్కువ వస్తువులను ఒకచోట చేర్చే విస్తృతమైన ఆభరణాల ప్రదర్శన ప్రత్యేకంగా నిల్వనుందని ఖతార్ మ్యూజియంల ఛైర్‌పర్సన్, హెచ్.ఇ. షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తెలిపారు. సీజన్ కు సంబంధించిన ప్రధాన ఆకర్షణలు నవంబర్ 6న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. డిజైన్ దోహా ఎడిషన్, అరబ్ డిజైన్ నౌ 2026 నేతృత్వంలో మొత్తం 20కి పైగా సంబంధిత ప్రదర్శనల కోసం మిడిలీస్టు, ఉత్తర ఆఫ్రికా మరియు దక్షిణాసియా నుండి పాల్గొనేవారిని ఒకచోట చేర్చుతుందన్నారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







