యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- June 20, 2026
అబుదాబి: యూఏఈలో వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. శనివారం (జూన్ 20) దేశంలో అత్యధికంగా 49.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అల్ ఐన్ ప్రాంతంలోని స్వేహాన్ వద్ద మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ (NCM) వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల మార్కుకు చేరువ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ప్రస్తుతం వేడి తీవ్రత గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 21న అల్ ధఫ్రా ప్రాంతంలోని ఔటైడ్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు ఏప్రిల్ 15న అల్ ఐన్‌లోని ఉమ్ అజీముల్ ప్రాంతంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం నమోదైన 49.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయిల్లో ఒకటిగా నిలిచింది.
ఈ సందర్భంగా ఎన్‌సీఎం వాతావరణ నిపుణుడు డాక్టర్ అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ, ఈ ఏడాది యూఏఈలో గత సంవత్సరాలతో పోలిస్తే మరింత వేడిగా ఉండే అవకాశం ఉందన్నారు. అయితే ప్రాంతాన్ని ప్రభావితం చేసే వాతావరణ వ్యవస్థల ఆధారంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండవచ్చని తెలిపారు.
వాతావరణ శాఖ ప్రజలకు అవసరం లేని సందర్భాల్లో మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







