యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- August 04, 2026
న్యూఢిల్లీ: యెమెన్ సముద్ర జలాల సమీపంలో భారత కార్గో నౌక ఎంఎస్వీ ఫైజ్ నూరే ఒలియా (MSV Faize Noore Oliya) పై ప్రక్షేపకం (ప్రాజెక్టైల్) తాకడంతో నౌక బోల్తాపడి సముద్రంలో మునిగిపోయినట్లు భారత కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి మంగళవారం వెల్లడించారు.
ఈ ప్రమాదం సమయంలో నౌకలో ఉన్న 14 మంది సిబ్బంది, వారిలో 13 మంది భారతీయులు, యెమెన్ కోస్ట్ గార్డ్ సకాలంలో చేపట్టిన సహాయక చర్యలతో సురక్షితంగా రక్షించబడ్డారు.
రక్షించిన సిబ్బందిని యెమెన్‌లోని మోఖా (Port of Mokha) నౌకాశ్రయానికి తరలించి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నౌకపై ప్రక్షేపకం ఎలా తాకింది? అనే అంశాలపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
భారత ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రక్షించబడిన భారతీయుల భద్రత కోసం యెమెన్ అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్‌లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..
- టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ హఠాన్మరణం
- పోలీస్ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించాలి: సీఎం రేవంత్







