ఒమాన్‌లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- August 05, 2026
మస్కట్: ఒమాన్‌లో ఆగస్టు నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ)కు చెందిన నేషనల్ మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. ఆగస్టు–సెప్టెంబర్–అక్టోబర్ 2026 కాలానికి సంబంధించిన సీజనల్ వాతావరణ అంచనాలను విడుదల చేసింది.ప్రతి నెల విడుదల చేసే ఈ సీజనల్ బులెటిన్ రానున్న నెలల్లో నెలకొనే వాతావరణ పరిస్థితులపై ముందస్తు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతుందని సీఏఏ తెలిపింది.
అయితే, ఈ అంచనాలు కేవలం దీర్ఘకాలిక సూచనలు మాత్రమేనని, రోజువారీ ప్రణాళికల కోసం స్వల్ప, మధ్యకాల వాతావరణ బులెటిన్లను తప్పనిసరిగా అనుసరించాలని అధికారులు సూచించారు.ప్రభుత్వ శాఖలు, వ్యాపార సంస్థలు, ప్రజలు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ సీజనల్ అంచనాలు ఉపయోగపడతాయని, ఇవి సాధారణ వాతావరణ హెచ్చరికలకు ప్రత్యామ్నాయం కాదని సీఏఏ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!







