పాఠశాల పరీక్షల ఫలితాలు..ఎడ్యుకేషన్ పోర్టల్ మరియు తవక్కల్నా యాప్ లో..!!

- June 21, 2026 , by Maagulf
పాఠశాల పరీక్షల ఫలితాలు..ఎడ్యుకేషన్ పోర్టల్ మరియు తవక్కల్నా యాప్ లో..!!

రియాద్ :సౌదీ అరేబియాలో విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం నుండి ఎడ్యుకేషన్ పోర్టల్ మరియు తవక్కల్నా ప్లాట్‌ఫామ్ ద్వారా పాఠశాల పరీక్షల ఫలితాలను ఎలక్ట్రానిక్‌గా ప్రకటించనుంది. దీని ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఫలితాలను మరింత సులభంగా, సౌకర్యవంతంగా తెలుసుకోవచ్చని తెలిపింది. మక్కా, మదీనా, జెడ్డా మరియు తైఫ్ విద్యా శాఖల పరిధిలోని పాఠశాలలు మినహా, మిగితా అన్ని ప్రాంతాల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఫలితాలు విడుదలైన వెంటనే ఎడ్యుకేషన్ పోర్టల్ లేదా తవక్కల్నా యాప్‌ను ఉపయోగించుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది.  

ఇదిలా ఉండగా, మక్కా, మదీనా, జెడ్డా మరియు తైఫ్‌లోని విద్యా శాఖలు మినహా, ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాల విద్యార్థులు రెండవ సెషన్‌లో అన్ని సబ్జెక్టులలో ప్రత్యామ్నాయ కేంద్ర పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యా మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది.  సౌదీ అరేబియాలోని అన్ని విద్యా శాఖలలో ఈ పరీక్షలు వచ్చే మంగళవారం నుండి ప్రారంభమవుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాలలో, తుది పరీక్షలు జూన్ 14న ప్రారంభమయ్యాయి. నాలుగు విద్యా శాఖలలో సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులు వివిధ విద్యా స్థాయిలలో పరీక్షలకు హాజరవుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com