ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజెస్ కు చోటు..!!
- June 22, 2026
కువైట్: ప్రాంతీయ ప్రైవేట్ రంగంలో కువైట్ బలమైన ఉనికిని చాటిచెబుతూ, ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ యొక్క "టాప్ 100 అరబ్ ఫ్యామిలీ బిజినెస్" 2026 జాబితాలో ఆరు ప్రముఖ కువైట్ వ్యాపార గ్రూపులు చోటు దక్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించిన కువైట్ కంపెనీలు వరుసగా అల్ఘానిమ్ ఇండస్ట్రీస్, అల్షాయా గ్రూప్, అల్సయేర్ గ్రూప్, అల్ ముల్లా గ్రూప్, అల్-ముధాఫ్ అండ్ అల్-కులైబ్ గ్రూప్, మరియు అల్ఘానిమ్ అండ్ సన్స్ గ్రూప్ ఉన్నాయి.
రిటైల్, ఆటోమోటివ్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియా మరియు హాస్పిటాలిటీ వంటి రంగాలలో ఈ గ్రూపులు కార్యకలాపాలను కలిగి ఉన్నాయి. అలాగే అవి ప్రాంతీయ మరియు అంతర్జాతీయంగా భారీ విస్తరణ ప్రణాళికలను కలిగి ఉన్నాయని ఫోర్బ్స్ ప్రముఖంగా ప్రస్తావించింది.
ఈ ర్యాంకింగ్ జాబితాలో మొత్తం 100 కంపెనీలలో 86 గల్ఫ్ దేశాల నుండే ఉన్నాయి. ఈ జాబితాలో సౌదీ అరేబియా 32 కంపెనీలతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ 31 కంపెనీలతో, ఖతార్ 10 కంపెనీలతో నిలిచాయి. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకారం, అరబ్ ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఉపాధి, పెట్టుబడులు మరియు ఆర్థిక వృద్ధికి కుటుంబ యాజమాన్యంలోని సంస్థలే ప్రధానంగా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







