నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్‌ట్రావాగంజా' ప్రారంభం..!!
- June 24, 2026
సోహార్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ విలాయత్‌లో 'మ్యాంగో ఎక్స్ ట్రావాగంజా 2026' (మామిడి పండ్ల ఉత్సవం) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని సోహార్ 'వలీ' (ప్రాంతీయ అధికారి) కార్యాలయం.. నార్త్ అల్ బతినాలోని వ్యవసాయ, మత్స్య మరియు జల వనరుల డైరెక్టరేట్ జనరల్ సహకారంతో నిర్వహిస్తోంది. ఇందులో గవర్నరేట్‌లోని వివిధ విలాయత్ల నుండి అనేక మంది రైతులు పాల్గొంటున్నారు.
నార్త్ అల్ బతినా గవర్నర్ మహమ్మద్ సులైమాన్ అల్ కిండి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ప్రారంభమైంది. వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం, ఒమానీ మామిడి పంట స్థాయిని పెంచడం, గవర్నరేట్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత మరియు వైవిధ్యాన్ని చాటిచెప్పడం, తమ ఉత్పత్తులను విక్రయించేలా ప్రోత్సహించడం మరియు స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి కొత్త అవకాశాలను కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సోహార్ వలీ షేక్ సౌద్ మహమ్మద్ అల్ హినాయి వివరించారు.
ఈ ఉత్సవంలో 45 పెవిలియన్లు ఏర్పాటు చేశారు. వీటిలో వివిధ రకాల ఒమానీ మామిడి పండ్లు మరియు వాటి అనుబంధ ఉత్పత్తులతో పాటు తాజా ఖర్జూరాలు (రుతాబ్), గ్రేబ్స్, అరటిపండ్లు, అంజూర (figs) మరియు నిమ్మకాయలు వంటి ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తున్నారు. వీటితోపాటు అనేక శాస్త్రీయ మరియు అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యవసాయ రంగ నిపుణులు మరియు శాస్త్రవేత్తలు పాల్గొని వారి అనుభవాలు, పరిశోధనలను రైతులతో పంచుకుంటున్నారు. అలాగే, నార్త్ అల్ బతినా గవర్నరేట్‌కు చెందిన రైతుల తమ విజయవంతమైన అనుభవాలను వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







