సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- June 24, 2026
కువైట్: సమ్మర్ తలెత్తే అగ్నిప్రమాదాలపై కువైట్ ఫైర్ ఫోర్స్ హెచ్చరించింది. అధిక విద్యుత్ వినియోగం, వైరింగ్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం, విద్యుత్ ఉపకరణాలను ఎక్కువసేపు రన్నింగ్ లో పెట్టి వదిలివేయడం వంటివి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతాయని హెచ్చరించింది. వేసవి కాలంలో భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కువైట్ అగ్నిమాపక దళం పౌరులను, నివాసితులను కోరింది.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు విద్యుత్ ఉపకరణాల వాడకం పెరగడం వల్ల అగ్ని ప్రమాదాల ముప్పు అధికమవుతుందని కువైట్ అగ్నిమాపక దళం పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ మరియు అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అల్-ఘరీబ్ అన్నారు.
ఇళ్లలో మరియు ఇతర సదుపాయాలలో ప్రమాదాల సమయంలో వేగంగా, సురక్షితంగా బయలకు వెళ్లే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ పరికరాలు మరియు గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు భద్రతా సూచనలను పాటించాలని అల్-ఘరీబ్ పిలుపునిచ్చారు.
నివారణ అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని, భద్రతా చర్యలను పాటించడం ద్వారా ప్రమాదాలను, నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఇరవై నాలుగు గంటలపాటు ఫైర్ ఫోర్స్ రెడీగా ఉంటుందని, అత్యవసర పరిస్థితుల గురించి వెంటనే 112కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







