మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!
- June 25, 2026
మస్కట్: ప్రతి సంవత్సరం జూన్ 26న మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని పాటించడంలో రాయల్ ఒమన్ పోలీస్ (ఆర్ఓపి) ప్రపంచంలోని ఇతర దేశాలతో చేతులు కలుపుతోంది. సమాజాల భద్రతకు, వ్యక్తుల ఆరోగ్యానికి ముప్పు కలిగించే తీవ్రమైన సమస్యలను పరిష్కరించే ప్రాముఖ్యతను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తోంది.
ఈ సంవత్సరం, కొత్త పదార్థాల ఆవిర్భావం మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహించడంలో ఆధునిక సాంకేతికతలు, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగ ధోరణులలో వచ్చిన మార్పులపై దృష్టి సారించనున్నారు. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం మరియు అంతర్జాతీయ సహకారపరిధిని విస్తరించడం వంటివి పోరాట చర్యలలో భాగంగా చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 27న సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు అ’సీబ్‌లోని అల్ మౌజ్ వాక్‌లో ఒక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. జూన్ 28న మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల నిర్మూలన డైరెక్టరేట్ జనరల్, అ’సీబ్ విలాయత్‌లోని మస్కట్ మాల్లో ఒక ప్రదర్శనను కూడా నిర్వహిస్తుంది. మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో డైరెక్టరేట్ జనరల్ చేపట్టే భద్రతా చర్యలను ఈ ప్రదర్శనలో వివరిస్తారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







