20 నకిలీ కువైట్ పౌరసత్వాలు రద్దు

- August 11, 2016 , by Maagulf
20 నకిలీ కువైట్ పౌరసత్వాలు రద్దు

మనామా: నకిలీ పౌరసత్వ ధరకాస్తులతో మోసగించినట్లు  నిర్ధారింపబడటంతో  కువైట్ స్వదేశస్గులుగా  పరిగణించబడుతున్న 20 మంది అక్రమ కువైటీయులని  పరిశోధనలు అనంతరం వారి జాతీయతను తొలగించినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.  వీరిలో 19 మంది పురుషులు మరియు ఒక మహిళ తమ జాతీయతని గుట్టుగా దాచిపెట్టినట్లు సమాచారం  కువైట్ పౌరసత్వం చట్టం ప్రకారం ఎవరైనా  దరఖాస్తుదారుడు  తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికేట్లు అందించినట్లుగా నిర్ధారణ కాబడితే వారి జాతీయతఉపసంహరించబడుతుంది. అప్లికేషన్లు తనిఖీ సమయంలో ఒక పురుషుని మరియు స్త్రీ సంబంధించిన పుట్టిన తేదీలు పై దృష్టి సారించిన అధికారులు వాటిని తప్పుగా ఒకో చోట ఒకో విధంగా చూపడంతో ఈ నకిలీ పౌరసత్వాల గుట్టు రట్టయింది. అంతర్గత మంత్రి నుండి ఒక అభ్యర్థన ఆధారంగా వారి పౌరసత్వాలను రద్దు చేయాలని  కేబినెట్ కు  ఆదేశించారు.కువైట్ భద్రతా అధికారులు ఇటీవల కువైట్ జాతీయత పొందటానికి పలువురు సామాజిక మరియు ఆర్ధిక ప్రయోజనాలు నుండి పొందేందుకు నకిలీ పౌరసత్వాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు  ఈ విషయంలో శ్రద్ధగా పరిశీలించడంతో పలువురు అక్రమార్కులు దొరుకుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com