'ఎమ్.ఎస్. ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ' చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల .
- August 11, 2016
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఎమ్.ఎస్. ధోనీ-ది అన్‌టోల్డ్ స్టోరీ'. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితాధారంగా ఈ సినిమాని దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించారు. ఇందులో రీల్ ధోనీగా సుశాంత్ నటించాడు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల కాబోతోంది. ట్రైలర్‌ను దిల్లీలో సుశాంత్ సింగ్ చదివిన కులాచి హన్స్‌రాజ్ మోడల్ స్కూల్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి సుశాంత్ సింగ్‌తో పాటు ధోనీ కూడా హాజరయ్యాడు. ధోనీ రాకతో అక్కడి వాతావరణం సందడిగా మారింది.
సుశాంత్ తన స్కూల్ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. స్కూల్‌భవనం మొదటి అంతస్థులోని రెండో గదే తన క్లాస్‌రూం అంటూ సుశాంత్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







